రైతులు ఎల్లప్పుడూ వరినే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వరిలో సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబీ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు.