మాడుగులపల్లి: ఘనంగా ఉగాది వేడుకలు

75చూసినవారు
మాడుగులపల్లి: ఘనంగా ఉగాది వేడుకలు
మాడుగులపల్లి మండలంలోని చెరువుపల్లిలో హిందూబంధు మిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బొడ్రాయి దగ్గర ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేశారు. గ్రామంలో పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు సిరిసంపదలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇటికాల జాన్ రెడ్డి, జూలకంటి భూపాల్ రెడ్డి, తుమ్మనగోటి వేణు, శోభన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్