నల్గొండ: నూతన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
నల్గొండ: నూతన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో భాగంగా డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిర్యాలగూడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుండి ఎమ్మెల్సీ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్