సమిష్టి కృషితో మరిన్ని సేవలు లైన్స్ క్లబ్ ద్వారా చేద్దామని నూతనంగా ఎన్నికైన లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఖమ్మం, నల్గొండ డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మదన్మోహన్ తెలిపారు. ఆదివారం ఫస్ట్ డిస్టిక్ గవర్నర్గా కేవీ ప్రసాద్, సెకండ్ డిస్టిక్ గవర్నర్‌గా కోడె సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన లైన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.