నల్గొండ: ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు దేవతగా పూజింపబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ ఇలా త్రిపాఠిలను బాలు నాయక్ శాలువాతో సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.