ఈ వేసవిలో దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ కాలనీలలోని చివరి ఇండ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం ఆమె దేవరకొండ ఆర్ డి ఓ కార్యాలయంలో దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.