డీఎస్సీ 2024 అభ్యర్థుల కౌన్సిలింగ్ సజావుగా నిర్వహించాలి
సూర్యపేట జిల్లాలో అవసరం ఉన్న ప్రతి పాఠశాలకు డీఎస్సీ 2024 అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయాలని పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ లు కోరారు. మంగళవారం డీఎస్సీ 2024 సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రారంభం కానునందున వారు డిఈఓ అశోక్ తో సమావేశమయ్యారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా కౌన్సిలింగ్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.