Nov 23, 2024, 16:11 IST/ఖానాపూర్
ఖానాపూర్
ముఖ్యమంత్రిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
Nov 23, 2024, 16:11 IST
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంద్రవెల్లి మండలంతో పాటు కేస్లాపూర్, ఉట్నూర్, జన్నారం, పెంబి, కడెం మండలాల్లో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.