ఫోనును అప్పగించిన పోలీసులు

79చూసినవారు
ఫోనును అప్పగించిన పోలీసులు
పోగొట్టుకున్న ఫోన్ ను కనిపెట్టి అసలు యజమానికి జన్నారం పోలీసులు అప్పగించారు. జన్నారం మండలంలోని పొనకల్ కు చెందిన కొరుకంటి మనోహర్ రావు ఫోన్ ను మే 14న పోగొట్టుకున్నారు. దీంతో స్థానిక ఎస్సై రాజవర్ధన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్చార్జి పిసి రవీందర్ సిఇఐఆర్ పద్ధతి ద్వారా ఫోనును కనుగొని సోమవారం యజమానికి అందజేశారు అందజేశారు. దీంతో యజమాని మోహన్ రావు జన్నారం పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.