బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం లోకేశ్వరం మండలం బందుకు హిందూ ఐక్య వేదిక పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, నరమేధాన్ని ప్రతి ఒక్క హిందువు ఖండించాలని వారు పేర్కొన్నారు. బందుకు మండలంలోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు సముదాయాల యజమానులు సహకరించాలని కోరారు.