జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు లో దేశ్ పాండే ఫౌండేషన్, కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడుతున్న ఎస్ఐవీ సెంటర్ ను దేశ్ పాండే ఫౌండేషన్ కర్ణాటక ఎంఐఎస్ మేనేజర్ వెంకటేష్, ఐడీఎచ్ ప్రవీణ్, మండల విద్యాశాఖాధికారి యం నరేందర్ శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను, ప్రగతిని మెచ్చుకున్నారు. ఎస్ఐవీ ఆలూరు ఇన్స్ట్రక్టర్ సువర్ణ పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు.