ఆర్మూర్ పట్టణంలోని విశాఖ కాలనీ బీసీ సంక్షేమ హాస్టల్ లో బుధవారం తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 4 నియోజకవర్గాలకు ( ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నిజామాబాద్, అర్బన్ నిజామాబాద్) సంబంధించిన గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ శిక్షణ అనంతరం గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ స్టీవెన్, మోర్తాడ్ సీఐ గుండప్ప తదితరులు పాల్గొన్నారు.