తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే చట్టసభల్లో పట్టభద్రుల గొంతుక వినిపిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాన్సు వాడ పట్టణంలో పలువురు పట్టభద్రులను కలసి ప్రచారం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీమెజారిటీ తో గెలిపించాలని కోరారు.