మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మూడో రోజు మండల కేంద్రంలో ఇంటింటికి సర్వే నిర్వహించారు. అనంతరం క్యాంపు పరిసర ప్రాంతాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమధానం నిర్వహించారు. దేశభక్తి, సేవా కార్యక్రమాలతో పాటు వాలంటీర్లు త్యాగగుణం అలవర్చుకోవాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్రిపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, కు మార్, రాజేష్, నవీన్ , గంగాధర్ పాల్గొన్నారు.