జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూర్ లో శనివారం నేషనల్ ఓటర్స్ డే ఘనంగా నిర్వహించారు. నేషనల్ ఓటర్స్ డే సందర్బంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు యం. నరేందర్ అధ్యక్షత వహించి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆలూర్ మండల తహసిల్దార్ రమేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.