బీజేపీ రాష్ట్ర నాయకుల ఆదేశాల ప్రకారం శనివారం బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాలోని 21 మండలాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. అందులో భాగంగా ఆలూరు మండలానికి సుర శ్రీకాంత్ ప్రకటించడంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని స్థానిక సంస్థల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.