విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా నందిపేట నందికేశ్వర ఆలయంలో ఆదివారంప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించి నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థించి, ప్రజలందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేసి పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ మచ్చర్ల సాగర్, వైస్ ఛైర్మన్ కిషన్, కోశాధికారి ముత్యం, ఆలయ కమిటీ డైరెక్టర్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.