డొంకేశ్వర్ మండల అన్నారం గ్రామంలో ఉగాది పండుగను ప్రజలు శడ్రుచులతో ఆనందోత్సవాల మధ్య ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, భక్తులు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు పచ్చడి వితరణ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.