బోధన్ పట్టణ శివారులోని పాండు తర్ప బాబా గార్డెన్ ముందు బైపాస్ రహదారి ప్రక్కన వీరభద్ర స్వామి విగ్రహం వద్ద కొందరు మాంసపు వ్యాపారులు వ్యర్దాలు పారవేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరభద్ర స్వామి విగ్రహం వద్దకు పూజా కార్యక్రమాల చేసే భక్తులు అక్కడి చుట్టుపక్కల వేసిన వ్యర్దాల ద్వారా వచ్చే దుర్గంధం వలన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.