బోధన్ మండలం హంగార్గ గ్రామంలో గత ఆరు రోజుల నుంచి అఖండ శివనామ సప్తహ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. 7 రోజుల పాటు సప్తహ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా నిత్య అన్నదానం కొనసాగింది. మహిళలు ఆదివారం మంగళ హారతులతో సప్తహ మండపం వద్దకు వచ్చి ప్రతిష్టించిన ఐదు కళశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో సప్తహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వినోద్, నీలకంఠరావు తెలిపారు.