బిచ్కుంద మండలం గోపన్నపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం శాంతాపూర్ నుండి నీలగిరి కట్టెలను హస్గుల్ కు చెందిన ఈర్వంత్ అనే రైతు, తన చేనులో గుడిసె వేయడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా గోపనపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్ లో ఉన్న రైతు ఈర్వంత్ (50) కట్టెల కింద పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.