నిజామాబాద్ జిల్లాలో మహిళను చంపి పూడ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండల కేంద్రానికి చెందిన జంగం విజయ(45) బీడీ కార్మికురాలు. ఆమె అదే మండలానికి చెందిన బుచ్చన్న వద్ద లక్ష రూపాయల చిట్టి వేసింది. దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వమని బుచ్చన్నను పదేపదే అడగడంతో పరువు తీస్తుంది అని కక్ష కట్టి అతని పాలేరుతో కలిసి ఆమెను చంపి పూడ్చారు. విజయ కొడుకుతో ఒక వ్యక్తి మద్యం మత్తులో విషయం చెప్పగా శనివారం అతను పోలీసులను ఆశ్రయించగా విషయం బయట పడింది. సీఐ సురేష్ నిందితులపై కేసు నమోదు చేశారు.