ఫిలిప్పీన్స్లో నిజామాబాద్ జిల్లా యువకుడు మృతి
ఫిలిప్పీన్స్లో రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ అనే యువకుడు మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో చదువు పూర్తి కానున్నది. అయితే ఈ ప్రమాదం జరగడంతో అతని కుటుంబంలో సోమవారం తీవ్ర విషాదఛాయాలు అలుముకున్నాయి.