వర్షానికి దెబ్బతిన్న వైద్యశాల భవనాలు
వికారాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 10 పశు వైద్యశాల భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పశువుల ఆసుపత్రి భవనం దెబ్బతిందని వివరించారు.