ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేతో ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల దరఖాస్తులు నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు.