మన మదనపల్లె టీచర్.. ఢిల్లీ కొత్త సీఎం!
దేశ రాజధాని ఢిల్లీకి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న ఆతిశీ మార్లేనా సింగ్.. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఢిల్లీకి సీఎం కానున్న ఆతిశీ.. మధ్యప్రదేశ్‌లోనే కాదు ఏపీలోనూ ఆమె టీచర్‌గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలో ప్రఖ్యాత రిషీ వ్యాలీ స్కూల్ పిల్లలకు ఆతిశీ పాఠాలు బోధించారట. ఇది కూడా సరిగ్గా 2013 సమయంలోనే కావడం విశేషం. ఎంతకాలం పని చేశారనది తెలియరాలేదు.