హైడ్రా బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది: గౌతమ్ రావు
హైడ్రా బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అన్నారు. శుక్రవారం గొల్నాక డివిజన్ పరిధిలోని గంగానగర్ లంక, తులసిరాం నగర్ ప్రాంతాల్లో గౌతమ్ రావు పర్యటించారు. త్వరలో హైడ్రతో ఇళ్లను కూల్చివేస్తుందని స్థానికులు గౌతమ్ రావుతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లను కూల్చివేయకుండ చూస్తామని గౌతమ్ రావు వారికి హామీ ఇచ్చారు.