చాంద్రాయణగుట్ట: పాత రోడ్డును తవ్వడంతో ప్రయాణీకుల ఇబ్బందులు
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ మెయిన్ రోడ్డులో శుక్రవారం రోజు ఉదయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు కొత్త రోడ్డు వేయడం కోసమని పాత రోడ్డును తవ్వి పెట్టారు. తవ్వేసిన రోడ్డు వ్యర్ధాలు రోడ్డుకి అడ్డంగా వేయడంతో అటువైపు వాహనాలు వెళ్లేందుకు అనుకూలంగా లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.