పెద్ద అంబర్‌పేట్ 4వ వార్డ్ శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో సోమవారం చిల్డ్రన్స్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రార్థన మందిరంలో చిన్నారులు ఆటపాటలు, నృత్యాలను ప్రదర్శించారు. పాస్టర్ సిల్వధర్, సంఘం పెద్దలు సామెల్, మల్కన్న, యూత్ సభ్యులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆట పాటల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.