విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ సత్యనారాయణ చెప్పారు. సోమవారం కడ్తాల్ లో మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించి పరీక్ష చేపట్టారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులలో ఇంగ్లీష్ మీడియం నుండి ముగ్గురు, తెలుగు మీడియం నుండి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.