ఆ ఎమ్మెల్యేల పదవులు ఊడటం ఖాయం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖామన్నారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామన్నారు.