హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయనను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు మంచి గుర్తింపు ఉంది.