భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో సోమవారం మైనార్టీ నేదల ఆధ్వర్యంలో జరిగిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 136వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.