రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఫరూక్ నగర్ లోని నాగులపల్లి రోడ్డులో ఉన్న అక్బరుద్దీన్ షా దర్గాలో సోమవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఫరూక్ నగర్ జామే మస్జిద్ ఇమామ్ సయ్యద్ షాబుద్దీన్, సయ్యద్ అజరుద్దీన్ హఫెజ్ ల ఆధ్వర్యంలో సయ్యద్ అక్బరుద్దీన్ షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోపాటు కాంగ్రెస్ నాయకులు, హాజరయ్యారు.