రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్‌నగర్ పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ వెనకాల ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుండి శుక్రవారం చాలా సేపుగా నీరు ఓవర్ ఫ్లో అయి ప్రవహిస్తుంది. నీరు వృథాగా పోతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఈ విషయమై స్పందించాలని కోరుతున్నారు.