ఉగాది పండుగ సందర్భంగా కాటేడాన్ బంగారు మైసమ్మ దేవాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించి, నాయకులు మరియు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు, శాంతి కలిగించాలని ఆకాంక్షించారు.