మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం నియోజకవర్గ ముస్లిం ప్రజల కోసం ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. షాద్ నగర్ ఆర్డీఓ సరిత నేతృత్వంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆరు మండలాల ఎమ్మార్వోలు, సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంకర్ తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి హాజరయ్యారు.