మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
పేదల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఓ గొప్ప అభయహస్తమని, ప్రజా పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం కొత్తూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ. 500 లకు వంట గ్యాస్ పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్దిదారులకు స్వయంగా అందజేశారు.