షాద్ నగర్: వైభవంగా బ్రాహ్మణ కార్తీక వనభోజన ఉత్సవం
నాటి నుంచి నేటిదాకా మన సంస్కృతిని పరిరక్షిస్తున్నది బ్రాహ్మణులేనని భవిష్యత్తులో కూడా ఈ పరిరక్షణ బాధ్యత బ్రాహ్మణులదేనని ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు జోషి గోపాల శర్మ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు లో గల మాజీ ఈనాడు పాత్రికేయులు సంతోష్ కుమార్ తోటలో జరిగిన బ్రాహ్మణ సమాఖ్య వనభోజన మహోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.