అందోల్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలలో పనికి ఆహార పథకంనకు సంబంధించిన పనులను మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని సీతానగర్, రాంపూర్, గ్రామంలో నర్సరీ, అల్లాదుర్గం గ్రామపంచాయతీ పరిధిలో పశువుల పాకను వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, ప్రత్యేక అధికారి కే. శంకర్, ఏపీవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.