దుబ్బాక: విద్యార్థులకు వైద్య పరీక్షలు
సిద్ధిపేట జిల్లా జడ్పీహెచ్ఎస్ ధర్మాజీపేట పాఠశాలలో బుధవారం ఎనీమియా ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ హెల్త్ కేర్ భాగంగా ఆర్బిఎస్కె వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఎత్తు, బరువు మరియు రక్తహీనత పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులలో ఉండే రక్తహీనత పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.