ప్రారంభమైన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
కంది పరిధిలోని హరే కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాధాకృష్ణుల విగ్రహాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. శ్రీ కృష్ణుని పై ఆలపించిన కీర్తనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. 26వ తేదీన కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.