నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న రైతు వేదికల్లో జరిగే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడిఏ నూతన్ కుమార్ సోమవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు VC ఉన్న రైతు వేదికలో రైతు నేస్తం పాట, వ్యవసాయ సూచన వీడియో ప్రదర్శన, అనంతరం యాసంగిలో కూరగాయల పంటల సాగుపై చర్యలు అంశంపై శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తారని తెలిపారు.