అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు తోట కమలాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు కమలాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమలాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.