సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోహెడ మండలంలోని చంచల్ చెరువు పల్లి నుండి వెంకటేశ్వర్లపల్లి వరకు రూ. 1.20 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.