సిద్ధిపేట: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

73చూసినవారు
సిద్ధిపేట: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఎలాంటి పరిస్థితుల్లోను అపరిచిత వ్యక్తులను నమ్మొద్దని టూటౌన్ ఎస్సై రాజేశం అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, షీటీమ్, ర్యాగింగ్, ఈవోజింగ్, పోక్సో, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్