జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మెగా జాబ్ మేళాను డిసెంబర్ 11 జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయం డీపీఓలో నిర్వహిస్తామని ఆదివారం ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హత కలిగినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.