సుల్తానాబాద్ మండలం కదంబపూర్ కు చెందిన షేక్ రాజ్ మహమ్మద్- ఫరీదా దంపతుల ఏడాది పాప శనివారం ఇంటి పక్కన ఉన్న ఇసుక కుప్పలో ఆడుకుంటుంది. ఆ సమయంలో సయ్యద్ షకీల్ తన బొలెరో వాహనాన్ని అజాగ్రత్తగా తీయడంతో ఆ వాహనం రఫీదా తలపై నుండి వెళ్ళింది. తీవ్రంగా గాయపడిన పాపను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.