సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, హాస్టల్ భవనం, డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కామన్ మెనూ అమలు పై ఆరా తీశారు. ప్రహరీ పూర్తిగా నిర్మించాలని, బోర్వెల్ వేయించాలని కలెక్టర్ కు ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు.