కాసేపట్లో వర్షం
తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని వరంగల్, వికారాబాద్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురిసింది.